టీ20 తరహా క్రికెట్... తెలంగాణలో టీజీ20 లీగ్
- ఎనిమిది జట్లను ఏర్పాటు చేసిన హెచ్‌సీఏ
- జూన్ 20న తొలి మ్యచ్, జూలై 11న ఫైనల్ మ్యాచ్
- హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసిన ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్
- జూన్ 7న ఆటగాళ్ల వేలం
ఆయా జట్లను వివిధ సంస్థలు సొంతం చేసుకున్నాయి. హైదరాబాద్ జట్టును రూ.7.5 కోట్లకు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, రంగారెడ్డిని రూ.7.2 కోట్లకు బూరుగు ఇన్ఫ్రా ప్రణవ, వరంగల్‌ను రూ.6.55 కోట్లకు బైన్ గ్లోబల్ రిసోర్సెస్, మెదక్‌ను రూ.6.33 కోట్లకు బృందా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, నల్గొండను రూ.5.06 కోట్లకు కిశోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కరీంనగర్‌ను రూ.4.57 కోట్లకు ఈఐపీఎల్ గ్రూప్ (తిబరుమల్), మహబూబ్ నగర్‌ను రూ.4.5 కోట్లకు వీరభద్ర స్టీల్స్, ఖమ్మం జట్టును రూ.4.44 కోట్లకు అన్విత గ్రూప్ సొంతం చేసుకున్నాయి.
కాగా, ఈ ఫ్రాంచైజీల కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియను జూన్ 7న నిర్వహించనున్నారు.