భారత్ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!
- పాక్‌లో కాక్రోచ్ అవామీ పార్టీల ఆవిర్భావం
- ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు
- నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక
- విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం
- భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి
‘కాక్రోచ్ అవామీ పార్టీ’ తమ ఇన్‌స్టా బయోలో ‘‘అవును కాపీ కొట్టాం, కానీ ఎవరికి నష్టం? మా మోటో ఒక్కటే’’ అంటూ భారత్ నుంచి స్ఫూర్తి పొందినట్లు బాహాటంగానే అంగీకరించింది. ఈ అకౌంట్లు పూర్తిగా పాక్ నిరుద్యోగ జనరేషన్-జెడ్ యువత గొంతుకగా మారుతామని ప్రకటిస్తున్నాయి.
‘‘వ్యవస్థ ఎవరినైతే బొద్దింకలుగా భావించిందో.. మేం ఆ ప్రజల గొంతుకలం’’ అంటూ ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడతాం’ అనే ఉర్దూ నినాదంతో పాక్ యువత సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. నిరుద్యోగం, దేశ పాలన, రాజకీయ వ్యవస్థలపై తమకున్న అసంతృప్తికి ఈ బొద్దింక గుర్తును వాడుకుంటూ మీమ్స్ రూపంలో అక్కడి ప్రభుత్వాలపై నిరసనగా వ్యక్తం చేస్తోంది.