మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్
- సింగపూర్, అమెరికా, యూకే ప్రాంతాల్లో ఉద్యోగాల కోత
- ఇంటి నుంచి పని చేయాలని మొదట సూచన
- పది శాతం ఉద్యోగుల తొలగింపు
సింగపూర్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లోని ఉద్యోగులకు మొదట ఇంటి నుంచి పని చేయాలని కంపెనీ సూచించింది. అందుకు వారు సిద్ధమవుతుండగా, వేకువజామున వారికి లేఆఫ్ మెయిల్స్ పంపించింది. అయితే ఎలాంటి గందరగోళం జరగకుండా ఉండేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగింపుకు గురవుతున్న వారిలో ఎక్కువమంది ఇంజినీరింగ్, ప్రోడక్ట్ బృందాలు ఉన్నాయి.
మెటా తన సింగపూర్‌లోని టీమ్‌కు మొదట మెయిల్స్ పంపించింది. వారికి వేకువజామునే ఈ మెయిల్స్ అందాయి. ఈ తొలగింపుకు ముందు ప్రపంచవ్యాప్తంగా మెటాలో దాదాపు 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తాజాగా పది శాతం ఉద్యోగులకు లేఆఫ్ మెయిల్స్ వచ్చాయంటే సుమారు 8 వేల మందిని తొలగించనుంది.