ఈ నరకం నుంచి బయటికి తీసుకురండి... చంద్రబాబు, పవన్ లకు కువైట్ నుంచి మహిళ కన్నీటి వేడుకోలు
- తనను కాపాడాలంటూ సెల్ఫీ వీడియో తీసిన బాధితురాలు
- ఇళ్ళల్లో పని అని నమ్మించి ఏజెంట్ తనను కువైట్ పంపించాడన్న బాధితురాలు
- కువైట్‌లో తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని కంటతడి
కువైట్‌లో ఇళ్ళల్లో పని అని చెప్పి భాగ్యవతిని ఏజెంట్ అక్కడకు పంపించాడు. కానీ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారంటూ ఆమె కన్నీరుమున్నీరైంది. తాను తిరిగి భారత్ వెళతానని యజమానిని అడిగితే, ఏజెంట్‌కు తాను ఇచ్చిన డబ్బు కడితేనే పంపిస్తానని చెబుతున్నాడని ఆమె వాపోయింది. తనను యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తనను కాపాడాలని కోరింది.