మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో గుండు గీయించుకుని మహిళా కౌన్సిలర్ నిరసన
- ఫిరోజాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఘటన
- తన వార్డులో అభివృద్ధి పనుల్లో వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ
- అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో వినూత్న నిరసన
అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో గుండు గీయించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తన వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ అడ్డుకుంటున్నారని, దీని వల్ల గత మూడేళ్లుగా ఆ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని ఉషాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. ఆమె వార్డుకు సుమారు రూ.64 లక్షల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు వెల్లడించారు. కొన్ని పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తవుతాయని అన్నారు.