యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్
- ఎల్స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుషార్ కుమార్
- రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరిన తుషార్ కుమార్
- యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి
యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి తుషార్ కావడం గమనార్హం. తన నియామకంపై సామాజిక మాధ్యమాల వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఒకవైపు రాజకీయాల్లో రాణిస్తూనే తుషార్ ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు. తుషార్ తల్లి ప్రవీణ్ రాణి కూడా కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఆమె డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. తల్లి నుంచి స్ఫూర్తి పొంది తాను రాజకీయాల్లోకి వచ్చానని తుషార్ కుమార్ తెలిపారు.