కాంగ్రెస్ ఆఫీసులో 72 నల్లాలు ఎత్తుకెళ్లి ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు!
- ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఘటన
- ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి
- శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ నేతల ఆరోపణ
- కేసు నమోదు చేసిన పోలీసులు
గాంధీ చౌక్ సమీపంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇదొకటి. గతకొన్ని రోజులుగా ఈ ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలు ప్రేమ సందేశం రాశారంటే నగరంలోని శాంతిభద్రతలను ఎగతాళి చేయడమేనని మండిపడ్డారు.
పోలీసుల రాత్రి పెట్రోలింగ్ కేవలం కాగితాలకే పరిమితమైందని జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ పాఠక్ విమర్శించారు. రద్దీ ప్రాంతంలో ఉన్న ప్రధాన పార్టీ ఆఫీసుకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. డ్రగ్స్‌కు బానిసైనవారి పని అయ్యుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.