విజయ్ నాకు సమవుజ్జీ కాదు.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు
- కమల్ సీఎం అయితే అసూయపడతా
- స్టాలిన్ నాకు మంచి మిత్రుడు
- పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని
- రాజకీయాలతో సంబంధం లేదు
మరోవైపు విజయ్ సీఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లేదన్నారు. తమ వయసులో 28 ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు. కమల్ హాసన్ సీఎం అయితే అసూయ పడతాను గానీ, విజయ్ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు. రెండు ప్రధాన పార్టీలను ఢీకొని గెలిచిన విజయ్‌కు తాను శుభాకాంక్షలు తెలిపానని గుర్తుచేశారు.
ఇటీవల ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి విజయ్ గురించి ప్రస్తావించగా రజినీకాంత్ నవ్వుతూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు రావడాన్నీ రజినీ తాజాగా ప్రస్తావించారు. ఎవరో వ్యక్తి ఫోన్‌లో రికార్డు చేస్తూ అడిగిన ప్రశ్నకు తాను స్పందించలేదన్నారు. తాను అనవసరంగా ఇతర విషయాల గురించి మాట్లాడే వ్యక్తిని కాదన్నారు.