ప్యాంటు జేబుల్లో రూ.5.5 కోట్ల విలువైన బంగారం దాచిన భారత సంతతి వ్యక్తి అరెస్టు
- ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు
- ప్రత్యేకంగా రూపొందించిన తన ప్యాంటులో బంగారం బిస్కెట్లను పెట్టుకొచ్చిన నిందితుడు
- శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీకి వచ్చిన విమానం
నిందితుడు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎయిరిండియా విమానంలో ఢిల్లీకి వచ్చాడు. విమానాశ్రయంలో దిగి గ్రీన్ ఛానల్ మార్గంలో వెళ్ళేందుకు ప్రయత్నించగా, కస్టమ్స్‌కు చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగాధికారులు అనుమానించి అడ్డుకున్నారు. అతనిని పూర్తిగా తనిఖీ చేయగా ట్రౌజర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ప్యాకెట్లలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.