ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ హదాద్ మృతి
- హదాద్ మృతి చెందినట్లు ధృవీకరించిన హమాస్
- 2023లో జరిగిన దాడులకు సంబంధించి సూత్రధారుల్లో ఒకరిగా ఇజ్రాయెల్ వెల్లడి
- దాడుల్లో భార్య, కుమార్తె మృతి
హమాస్ కీలక నేత మొహమ్మద్ సిన్వర్ మృతి తర్వాత ఆయన బాధ్యతలను హదాద్ తీసుకున్నాడు. ఇజ్రాయెల్ రక్షణ దళాలపై దాడులకు వ్యూహరచన చేయడంలో హదాద్ కీలకంగా వ్యవహరించాడు. యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ సైనికులను పట్టుకోవడంతో పాటు, వారిని తనకు రక్షణ కవచంగా ఉపయోగించుకున్నాడు. హమాస్ స్థావరాల పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు.