అస్సాం చిన్నారి ‘వచ్చిందమ్మా’ సాంగ్‌కు నారా లోకేశ్ ఫిదా
- అస్సాం చిన్నారి నోట తెలుగు పాట
- భారతీయుల గుండె చప్పుడు అంటూ లోకేశ్ పోస్ట్
- సంగీతం, సంస్కృతులే దేశాన్ని ఏకం చేస్తాయని వ్యాఖ్య
మన దేశంలో వేర్వేరు భాషలు, భిన్నమైన సంస్కృతులు ఉన్నప్పటికీ మనందరి గుండె చప్పుడు ఒక్కటేనని లోకేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతమైన క్షణాలు చూసినప్పుడు దేశంలో ఉండే రాజకీయాల కంటే కూడా సంగీతం, సంస్కృతులే భారతీయులందరినీ చాలా లోతుగా ఏకం చేయగలవనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. అస్సాం చిన్నారి పాటతో ఇప్పుడు లోకేశ్ పోస్ట్ కూడా నెట్టింట ట్రెండ్ అవుతోంది.