రామ్ చరణ్, బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్... ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్
- జూన్ 4న థియేటర్‌లలో పెద్ది సినిమా
- ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల
- పెద్ది సినిమా చాలా బాగుంటుందన్న బుచ్చిబాబు
బిజీ షెడ్యూల్‌లో తనను రామ్ చరణ్ డ్రైవ్‌కు తీసుకువచ్చాడని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇందుకు రామ్ చరణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
అయితే సినిమా కచ్చితంగా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పాలని రామ్ చరణ్ అడగడంతో, బుచ్చిబాబు స్పందిస్తూ, జూన్ 4న థియేటర్‌లలోకి వస్తుందని అన్నారు.
ట్రైలర్ కూడా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని రామ్ చరణ్ అడగ్గా... ఈ నెల 18న విడుదల చేస్తామని బుచ్చిబాబు సమాధానం చెప్పారు. పక్కాగా విడుదల చేస్తారా? అని రామ్ చరణ్ మరోసారి ప్రశ్నించగా, తప్పకుండా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
బుచ్చిబాబు మాట్లాడుతూ, పెద్ది సినిమా చాలా బాగుంటుందని అన్నారు. ఇద్దరం ఎంతో మనసు పెట్టి దీనిని పూర్తి చేశామని అన్నారు. రామ్ చరణ్ పెద్ద స్టార్, ఆయన వద్దకు 'పెద్ది' వంటి మంచి కథతో వెళితే వెంటనే అంగీకరించారని తెలిపారు.