దర్శకుడిగా రామ్ పోతినేని.. బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్!
- దర్శకుడిగా మారిన హీరో రామ్ పోతినేని
- పుట్టినరోజున తన 23వ చిత్రంపై కీలక ప్రకటన
- ‘రాపో సినిమాటిక్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం
- సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్న రామ్
- 2026 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితమైన సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందులోని ‘వీర’ అనే పవర్ ఫుల్ పాత్రలో రామ్ కనిపించనున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ పోస్టర్‌ను బట్టి రామ్ ఒక ఇంటెన్స్ పాత్రతో రాబోతున్నారని అర్థమవుతోంది.
ఈ సినిమా కోసం రామ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబానికి చెందిన ‘స్రవంతి మూవీస్’ బ్యానర్ ఉండగానే, ప్రత్యేకంగా ‘రాపో సినిమాటిక్స్’ (RAPO Cinematics) పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
దర్శకుడిగా తన తొలి అడుగుపై రామ్ స్పందిస్తూ.. “ఇన్నాళ్లు వాళ్ల కథల్లో నా ముఖం చూశారు.. ఈ కథలో నా గొంతు వింటారు” అంటూ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య రూపొందనున్న ఈ చిత్రం 2026 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.