విదేశీ యువతికి సాయం చేసేందుకు ట్రాక్‌పైకి దూకాడు.. వీడియో ఇదిగో!
- రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య పడిన దుపట్టాను అందించిన వ్యక్తి
- సాయం చేశాక కృతజ్ఞత కోసం కూడా ఆగకుండా వెళ్లిపోయిన వైనం
- ఆయనే నిజమైన హీరో అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
- సోషల్ మీడియాలో 41 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
వివరాల్లోకి వెళితే, @indaha.l అనే ఇండోనేషియా డిజిటల్ క్రియేటర్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు వద్ద నిల్చుని ఉంది. ఈ క్రమంలో ఆమె కెమెరాను సర్దుకుంటుండగా తన దుపట్టా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న ఖాళీలో పడిపోయింది. ఆమె ఏమి చేయాలో తెలియక అయోమయంలో ఉండగానే, అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వెంటనే స్పందించారు.
మొదట చేత్తో తీయడానికి ప్రయత్నించినా దుపట్టా అందలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రాక్‌పైకి దూకి, దుపట్టాను తీసి ఆ యువతికి అందించాడు. ఆ తర్వాత ఆమె సాయం చేయబోయినా సున్నితంగా తిరస్కరించి, ప్లాట్‌ఫామ్‌పైకి ఎక్కాడు. కనీసం ఆమె చెప్పే కృతజ్ఞతల కోసం కూడా ఆగకుండా తన దారిన తాను నిశ్శబ్దంగా వెళ్లిపోయారు.
ఈ ఊహించని సహాయానికి ఆశ్చర్యపోయిన ఆ యువతి ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ "ఆయన ట్రాక్‌పైకి దూకుతారని అస్సలు ఊహించలేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆయనకు నా కృతజ్ఞతలు" అని రాసుకొచ్చింది. ఈ వీడియోకు ఇప్పటికే 41 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ఆయన ఒక హీరోలా నడిచి వెళ్లారు", "ఆ యువతి చేతిని సాయం కోసం కూడా పట్టుకోలేదు, ఆయనే నిజమైన జెంటిల్‌మన్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
More Telugu News
ప్రకాశ్ రాజ్ కు రామ్ గోపాల్ వర్మ మద్దతు
![]()
గొంగళి పురుగు తింటుంటే.. కాపాడండి అంటూ కందిరీగలను పిలుస్తున్న మొక్కలు!
![]()
మీ పిల్లలను అమెరికా పంపొద్దు: తమ్ముడి హత్యపై అన్షుల్ సోదరి ఆవేదన
![]()
స్టార్లు, బడ్జెట్ అవసరం లేదు.. ఈ సినిమా చూసి నేర్చుకోండి: రామ్ గోపాల్ వర్మ
![]()
భూమి వైపు దూసుకొస్తున్న సౌర తుపాను.. రేపటికి జీ3 హెచ్చరిక జారీ!
![]()
కిషన్ రెడ్డి సంగతి జూన్ 15 తర్వాత తేలుస్తా.. బరాబర్ జవాబిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
![]()
రేవంత్ రెడ్డికి కూడా అదే గతి పడుతుంది: కిషన్ రెడ్డి
![]()
ఈసారి మూడు నగరాల్లో ఏపీఎల్ 2026.. జూన్ 9 నుంచి క్రికెట్ పండగ
![]()
ఏడాదికి రూ.2 కోట్ల సంపాదన... అయినా ఆమెకు పెళ్లి కావడంలేదు!
![]()
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు
![]()
ఏపీలో '108' సేవలకు కొత్త రూపు
![]()
తనకు టీడీపీ రాజ్యసభ టికెట్ ఇవ్వడంపై భాష్యం రామకృష్ణ ఏమన్నారంటే...!
![]()
టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్... రోహిత్ శర్మ స్పందన
![]()
'సింగ్ గీతం'.. 20 ఏళ్లప్పుడు విన్న కథ, 70 ఏళ్లకు చూస్తున్నా: కమల్ హాసన్
![]()
రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
![]()