ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
- 9,990 మంది పరీక్షలు రాయగా 9,320 ఉత్తీర్ణులైనట్లు లోకేశ్ వెల్లడి
- ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా నమోదు
- అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ర్యాంకు కార్డులు
- వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు
ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/PGECET/PGECET/PGECET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్ నెంబర్లను ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ నుంచి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని సూచించారు. ఏపీ పీజీఈసెట్-2026లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలియజేశారు.