ఎల్లుండి అండమాన్ కు నైరుతి రుతుపవనాలు.. ఐఎండీ నివేదిక
- ఎండలకు అల్లాడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ కేంద్రం
- నైరుతీ రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా ఉందని వెల్లడి
- మే 16 నాటికి అండమాన్ నికోబర్‌కు నైరుతి రుతుపవనాలు
ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. కొన్నిచోట్ల అకాల వర్షాలు పడుతున్నప్పటికీ, కాసేపటికి లేదా మరుసటి రోజు ఎండలు తీవ్ర ప్రతాపం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు రానున్నయని వాతావరణ శాఖ తెలిపింది. మే 16 నాటికి నైరుతి రుతు పవనాలు అండమాన్ నికోబార్ చేరుకోవచ్చని అంచనా వేసింది.
వాతావరణ శాఖ ప్రకారం, మే 13 నుంచి 19 వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.