ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్... ఎట్టకేలకు ప్రారంభమైన మ్యాచ్
- కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- వర్షం కారణంగా గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్
- టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్
- ఆర్సీబీ జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, జాకబ్ డఫీ
- గాయం కారణంగా కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దూరం
ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని, టాప్-2లో నిలిచే అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. మరోవైపు, వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న కేకేఆర్, ప్లేఆఫ్స్ రేసులో తమ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి.
టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ, రొమారియో షెపర్డ్ స్థానంలో వెంకటేశ్ అయ్యర్, సుయాశ్ శర్మ స్థానంలో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చినట్లు తెలిపారు. ఛేజింగ్‌లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టి విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ, తాము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నట్లు చెప్పాడు. కీలక స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి చిన్న గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కాగా, అతని స్థానంలో సౌరభ్ దూబే అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.