సంజూ శాంసన్ చాలా సింపుల్... వీడియో ఇదిగో!
- నిరాడంబరతతో సీఎస్కే అభిమానుల మనసు గెలుచుకున్న శాంసన్
- బీచ్‌లో సరదాగా ఆడుకుంటున్న గ్రూప్‌తో కలిసి క్రికెట్ ఆడిన సంజు
- శాంసన్ నిరాడంబరతపై నెటిజన్ల ప్రశంస
అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన సంజు శాంసన్, ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు మారాడు. అప్పటి నుంచి చెన్నై చెట్టాన్ (అన్న)గా మారిపోయాడు. ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ లోకల్ సీఎస్కే అభిమానులతో మమేకమయ్యే ఉద్దేశంతో స్థానికులతో కలిసి బీచ్‌లో క్రికెట్ ఆడాడు. శాంసన్ ఎలాంటి భద్రత లేకుండా అక్కడకు వచ్చాడు. ప్రముఖ క్రికెటర్‌ను అనే ఆలోచనకు దూరంగా, అభిమానులతో కలిసిపోయి క్రికెట్ ఆడాడు.