అమెరికా 51వ రాష్ట్రంగా వెనెజువెలా... ట్రంప్ పోస్టుతో దుమారం
- ట్రంప్ పోస్టును ఖండించిన వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్
- ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు పోస్టు
- చైనా అధ్యక్షుడితో సమావేశానికి ముందు పోస్టుపై చర్చ
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా నిర్బంధించిన సమయంలో ఆయన నైట్ ట్రాక్ సూట్‌ను ధరించారు. ఆ సూట్‌ను పోలిన ట్రాక్ సూట్‌ను ధరించి, ఎయిర్ ఫోర్స్ వన్‌లో విమానంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ప్రయాణిస్తున్నట్లు కూడా ఈ పోస్టు ఉంది.
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యేందుకు చైనాకు వెళ్లనున్న సమయంలో, సామాజిక మాధ్యమంలో ఈ పోస్టు పెట్టడం చర్చకు దారి తీసింది. వైట్ హౌస్ కూడా ఈ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. వెనెజువెలాను తమ దేశంలోని కొత్త రాష్ట్రంగా పరిగణించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ పేర్కొన్నారు.