నీట్ పరీక్ష లీక్ వ్యవహారం.. రంగంలోకి దిగిన సీబీఐ
- లిఖితపూర్వక ఫిర్యాదు చేసిన కేంద్ర విద్యాశాఖ
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సీబీఐ
- నేరపూరిత కుట్ర, మోసం సహా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశించడంతో, సీబీఐ రంగంలోకి దిగింది. నేరపూరిత కుట్ర, మోసం, ఇతర నేరాలకు సంబంధించి బీఎన్ఎస్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న రాజస్థాన్ పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించడానికి త్వరలో ఒక బృందాన్ని అక్కడకు పంపించనున్నారు. 2024లోని నీట్ పేపర్ లీక్ కేసులను కూడా సీబీఐ ఛేదించింది.