ఓటీటీ తెరపైకి మలయాళ రొమాంటిక్ కామెడీ!
- మలయాళంలో రూపొందిన 'మధువీధు'
- ఏప్రిల్లో థియేటర్స్ లో విడుదలైన సినిమా
- ఓటీటీ హక్కులను దక్కించుకున్న సోనీలివ్
- ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే స్ట్రీమింగ్
- ఐదు భాషల్లో అందుబాటులోకి
ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీల థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. థియేటర్స్ వైపు నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓ మాదిరి వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సోనీ లివ్ వారు అధికారికంగా ప్రకటించారు. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
సాధారణంగా ఆడదిక్కు లేని ఇంటికి పిల్లను ఇవ్వకపోవడమనేది వెనుకటి నుంచీ ఉంది. ఎందుకూ అంటే అందుకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. అయినా అలాంటి ఒక ఇంటికి కోడలిగా వెళుతుంది స్నేహ. అక్కడ ఆమెకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేది మిగతా కథ. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఏ స్థాయి ఆదరణ పొందుతుందనేది చూడాలి మరి.