జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: పశ్చిమ బెంగాల్ సీఎం
- ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సువేందు అధికారి
- ప్రజారవాణాపై ఆధారపడే మహిళలకు ప్రయోజనం కలుగుతుందన్న సీఎం
- ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని హామీ
పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచి అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న సామాజిక సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు. పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని ఐదేళ్ళు పొడిగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.