నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత
- ఇకపై తాను చేసే సినిమాల్లో కథే హీరో అని స్పష్టం చేసిన సమంత
- నటీనటులు, నిర్మాత కంటే కథే గొప్పదని వ్యాఖ్య
- మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయడమే తన లక్ష్యమన్న నటి
- సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల
ఈ సందర్భంగా తన ఫిలిం ఫిలాసఫీని వివరిస్తూ, "నేను చేసే సినిమాల్లో కథే హీరో అవుతుంది. కథ అనేది నిర్మాత, నటీనటుల కంటే గొప్పది" అని సమంత స్పష్టం చేశారు. మహిళా ప్రేక్షకులు తాము చూసే పాత్రలతో మమేకమయ్యేలా, తమను తాము ఆ పాత్రల్లో చూసుకునేలా ఉండే చిత్రాలు చేయడమే తన లక్ష్యమని ఆమె వివరించారు.
ఇదే ఆలోచనతో ఆమె 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.