ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్
- ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ
- లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
- నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి
- లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన
ఏకనా స్టేడియం సమీపంలో నకిలీ టికెట్లు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నో సౌత్ డీసీపీ అమిత్ కుమార్ ఆనంద్ మాట్లాడుతూ.. నిందితులు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన వారని తెలిపారు. "చాట్‌జీపీటీ, గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వీరు నకిలీ టికెట్లను సృష్టించి, క్రికెట్ అభిమానులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు" అని ఆయన వివరించారు. ఓ అభిమాని వద్ద నకిలీ టికెట్ గుర్తించిన తర్వాత ఈ ముఠా గుట్టు రట్టయినట్లు తెలిపారు.