విజయ్ మంత్రివర్గంలో మేం చేరబోం... బయటి నుంచే మద్దతిస్తాం... వామపక్షాల సంచలన నిర్ణయం!
- విజయ్ పార్టీకి మద్దతివ్వాలని వామపక్షాల నిర్ణయం
- ప్రభుత్వంలో చేరబోమని, మంత్రి పదవులు వద్దని స్పష్టీకరణ
- బయటి నుంచే టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ఉద్ఘాటన
- మతవాద శక్తులను అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటన
- డీఎంకేతో తమ స్నేహం కొనసాగుతుందని వెల్లడి
రాష్ట్రంలో మతవాద శక్తులు పాగా వేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మతతత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాయి.
అదే సమయంలో, తమ చిరకాల మిత్రపక్షమైన డీఎంకేతో బంధం కొనసాగుతుందని వామపక్షాలు స్పష్టం చేయడం గమనార్హం. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామని తెలిపాయి.