మార్ష్ వీరబాదుడు.. వర్షంతో ఆగిన లక్నో-ఆర్సీబీ మ్యాచ్
- ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నోకు అదిరే ఆరంభం
- ఆకాశమే హద్దుగా చెలరేగిన మిచెల్ మార్ష్
- కేవలం 32 బంతుల్లో 76 పరుగులతో మార్ష్ విధ్వంసం
- 9 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా లక్నో 95 పరుగులు
- వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిన మ్యాచ్
మార్ష్ కేవలం 32 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (17 నాటౌట్) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. మార్ష్ దూకుడుతో లక్నో 9 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 95 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ దశలో వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎవరూ ప్రభావం చూపలేకపోయారు. కాగా, వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.