పంజాబ్‌పై హైదరాబాద్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి సన్‌రైజర్స్
- 20 ఓవర్లలో 235 పరుగులు చేసిన హైదరాబాద్
- భారీ లక్ష్యంతో బరిలోకి దిగి 202 పరుగులకే కుప్పకూలిన పంజాబ్
- 107 పరుగులతో రాణించిన కూపర్ కానెల్లీ
పంజాబ్ బ్యాట్స్‌మెన్ కూపర్ కానెల్లి ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లోనే 107 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ జట్టులో మిగిలిన ఆటగాళ్లు ఎవరూ రాణించలేదు. ఈ గెలుపుతో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో పంజాబ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోకి వచ్చింది. 11 మ్యాచ్‌లకు గాను 7 మ్యాచ్‌లు గెలిచి 14 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ రెండో స్థానానికి పడిపోయింది.