విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే
- కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందన్న డీఎంకే అధికార ప్రతినిధి
- అందుకే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని ఇలంగోవన్ మండిపాటు
- ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆగ్రహం
- పార్టీని మూసివేసుకునే పనులనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని వ్యాఖ్య
గత సంవత్సరం ఢిల్లీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో వారికి ఏమాత్రం అవకాశం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మూసివేసే పనులనే వారు చేస్తున్నారని విమర్శించారు.
టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసుకుంది. చెన్నైలోని టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించేందుకు కాంగ్రెస్ నాయకులు సుముఖత వ్యక్తం చేయగా, వారి నిర్ణయాన్ని విజయ్ స్వాగతించారు.