ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు ప్రదానం
- ప్రముఖ దర్శకుడు ఆర్. బాల్కీకి దాసరి జాతీయ అవార్డు 2026
- యువ దర్శకుడు రామ్ జగదీశ్‌కు దాసరి డెబ్యూ డైరెక్టర్ పురస్కారం
- తెలుగు సినిమా భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిచిందన్న బాల్కీ
ఈ కార్యక్రమంలో భారత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళ, కన్నడ దర్శకుల సంఘాల ప్రతినిధులు, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరవడం విశేషం.
అవార్డు అందుకున్న ఆర్. బాల్కీ మాట్లాడుతూ.. దాసరి వంటి మహనీయుడి జ్ఞాపకార్థం జరిగే కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తెలుగు ప్రేక్షకుల సినిమా పట్ల ఉన్న అభిరుచి, అభిమానమే తెలుగు సినిమాను నేడు భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిపిందని ప్రశంసించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తోందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ, జయప్రద వంటి సీనియర్ నటులు, పలువురు దర్శకులు పాల్గొన్నారు.