నన్ను బెంగాల్ నుంచి గెంటేశారు.. మమతా బెనర్జీపై స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు
- బెంగాల్లో మమత ఓటమిపై వివేక్ అగ్నిహోత్రి హర్షం
- తనను రాష్ట్రం నుంచి బహిష్కరించారని ఆరోపణ
- ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాని ప్రజలకు రహస్యంగా చూపించినట్లు వెల్లడి
- ఇక భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు పిలుపు
‘ది బెంగాల్ ఫైల్స్’ చిత్రాన్నీ మమతా బెనర్జీ రాష్ట్రంలో నిషేధించారని అగ్నిహోత్రి ఆరోపించారు. చివరకు ట్రైలర్ లాంచ్‌ను సైతం అడ్డుకున్నట్లు పేర్కొన్నారు. తమపై దాడులు జరిగాయని, అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. అయినా వెనకడుగు వేయకుండా ఎన్నికల సమయంలో ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాను రహస్యంగా అనేక మందికి చూపించినట్లు వెల్లడించారు. తన పోరాటానికి తగిన ఫలితం దక్కిందని.. ఎట్టకేలకు ఎన్నికల్లో గొప్ప విజయం సాధించామని వ్యాఖ్యానించారు. ఇక నుంచి బెంగాల్లో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదంటూ ఫలితాల అనంతరం విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.