తమిళనాడులో ఓటమిపై స్పందించిన స్టాలిన్
- ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత
- ఇప్పటి దాకా సమర్థ పాలన అందించాం, ఇక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్న స్టాలిన్
- జీవితంలో ఎన్నో గెలుపోటములు చూశానన్న స్టాలిన్
ఇన్నాళ్లు సమర్థవంతంగా పాలన అందించామని, ఇక నుంచి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పేర్కొన్నారు. తాము చేపట్టిన అభివృద్ధి పనులను చూపించి ప్రజలను ఓట్లు అడిగామని తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వాటిని కొనసాగిస్తామని హామీ కూడా ఇచ్చామని అన్నారు. కానీ తీర్పు తమకు అనుకూలంగా రాలేదని అన్నారు.
తన రాజకీయ జీవితంలో అద్భుత విజయాలు చూశానని, అలాగే ఓటములను కూడా చూశానని పేర్కొన్నారు. ఇకముందు డీఎంకే రాజకీయ ప్రయాణం ఎలాంటి తడబాటు లేకుండా కొనసాగుతుందని స్టాలిన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డీఎంకే రెండో స్థానానికి పరిమితమైంది.