ఉప్పల్ స్టేడియంలో భర్తతో కలిసి సందడి చేసిన పీవీ సింధు
- సన్‌రైజర్స్, కోల్‌కతా మ్యాచ్‌కు హాజరైన పీవీ సింధు
- భర్తతో కలిసి ఆరెంజ్ ఆర్మీకి మద్దతు
- ఇటీవలే ఊబర్ కప్ టోర్నీలో ఆడిన సింధు
ఈ జంట ఆరెంజ్ రంగు దుస్తుల్లో మెరిశారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్‌తో కలిసి సింధు దంపతులు మ్యాచ్‌ను వీక్షించారు. సింధు స్టేడియంలో కనిపించడంతో అభిమానులు హోరెత్తించారు.
ఇటీవలే ముగిసిన ఊబర్ కప్ టోర్నీలో పాల్గొన్న తర్వాత సింధు ఈ మ్యాచ్‌కు హాజరవడం గమనార్హం. ఈ టోర్నీలో చైనాతో జరిగిన గ్రూప్ ఏ చివరి మ్యాచ్‌లో భారత్ 0-5 తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్‌ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన ఆ మ్యాచ్‌లో సింధు ప్రపంచ నంబర్ 2 వాంగ్ జీ యితో తలపడింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు ఒక దశలో 18-12 ఆధిక్యంలో నిలిచినా, ఆ తర్వాత అనూహ్యంగా ఓటమి పాలైంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, బ్యాటర్లు రాణించకపోవడంతో 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయింది.