పెళ్లి వేడుకలో డీజే వాయించి, డ్యాన్స్ చేసిన అమెరికా విదేశాంగ మంత్రి
- విదేశాంగ మంత్రిగా, జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వహిస్తున్న మార్కో
- మియామిలోని పెళ్లి వేడుకకు హాజరైన మార్కో రుబియో
- హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేసిన మార్కో రుబియో
ఎంతో బిజీ షెడ్యూల్‌తో ఉండే ఆయన, ఇటీవల మియామిలోని ఒక నైట్ క్లబ్‌లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరయ్యారు. పెళ్ళికి హాజరైన వారిలో చాలామంది అక్కడ ఏర్పాటు చేసిన డీజేకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు. దీంతో మార్కో రుబియో కూడా డీజేను వాయించి డ్యాన్స్ చేసేవారిని మరింత ఉత్సాహపరిచారు. హెడ్ ఫోన్స్ ధరించి డిజే కన్సోల్‌ను ఆపరేట్ చేశారు. డీజే వద్దనే అందరితోపాటు ఆయన కూడా కాలు కదిపారు.