సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్
- ఏఐ దెబ్బకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడి
- అందరినీ తొలగించి ఇద్దరు ఏఐ నిపుణులను కంపెనీ నియమించుకుందని వెల్లడి
- కుటుంబపోషణ కోసం మెక్‌డొనాల్డ్‌లో చేరానన్న నెటిజన్
అద్దె చెల్లించడానికి, కుటుంబ పోషణ కోసం తాను మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్నానని పేర్కొన్నాడు. తాను పనిచేసిన కంపెనీలో ఉద్యోగం కోల్పోయింది తాను ఒక్కడినే కాదని చెప్పాడు. తమ బృందంలో 12 మంది ఉద్యోగులం ఉండేవాళ్లమని, అందరినీ తొలగించి కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను మాత్రమే ఆ కంపెనీ నియమించుకుందని వెల్లడించాడు.
తనకు తెలిసిన ఎంతోమంది అనుభవజ్ఞులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి కూడా ఇదేనని ఆ పోస్టులో ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సుమారు 200 మంది డెవలపర్లు తనకు తెలుసునని చెప్పాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఎంతోమంది సంబంధం లేని ఉద్యోగాల్లో చేరుతున్నారని చెప్పాడు.