అవును మేం పైరేట్లమే... ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
- తాము సముద్రపు దొంగల వంటి వాళ్లమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
- ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవడం లాభదాయకమని వెల్లడి
- ఫ్లోరిడా ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రజల కేరింతలు
ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, "మేము నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును, చమురును స్వాధీనం చేసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం," అని అన్నారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయగానే సభలో ఉన్న ఆయన మద్దతుదారులు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు.
ఇటీవల అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్', 'టూస్కా' వంటి ఇరాన్ జెండా ఉన్న కార్గో నౌకలను అడ్డగించి స్వాధీనం చేసుకున్నాయి. ఈ చర్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యను "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని అభివర్ణించింది. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ ఆరోపించారు.
ఇరాన్ చేసిన ‘సాయుధ దోపిడీ’ ఆరోపణలకు బదులిస్తూ, ట్రంప్ తాము సముద్రపు దొంగలమేనని అంగీకరించినట్లుగా మాట్లాడారు. ఇదే సమయంలో, ఇరాన్ చర్యలు తనకు సంతృప్తికరంగా లేవని, ఆ దేశంతో యుద్ధాన్ని ముగించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.