ట్రంప్‌ను 'చిన్నారుల హంతకుడు'గా అభివర్ణించిన ఇరాన్
- నష్టపరిహారం చెల్లించి, తమ ప్రాంతం విడిచి వెళ్లాలని అమెరికాకు డిమాండ్
- బలప్రయోగం చేస్తే కఠినమైన చెంపదెబ్బ తప్పదని తీవ్ర హెచ్చరిక
- ఇటీవల దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
- కాల్పుల విరమణ కొనసాగుతున్నా పెరుగుతున్న మాటల యుద్ధం
శుక్రవారం ఆయన మాట్లాడుతూ, అమెరికా చౌకబారు మైండ్ గేమ్స్, వాక్చాతుర్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. "శాంతి, స్నేహాన్నే ఇరాన్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఎవరైనా మాతో బలప్రయోగం చేసే భాషలో మాట్లాడితే, వారికి కఠినమైన చెంపదెబ్బ తప్పదు" అని ఆయన హెచ్చరించారు. "పిల్లల హంతకుడు తవ్విన గొయ్యి నుంచి అమెరికా అధికారులు బయటపడి, తమ దేశానికి తిరిగి వెళ్లాలి" అని తబాతబాయి ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు ముందు అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో పౌరులు మరణించారని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా, మినాబ్‌లోని ఓ పాఠశాలపై జరిగిన దాడిలో వంద మందికి పైగా బాలికలు మరణించారని ఇరాన్ చెబుతోంది.