నా కుటుంబం ఫొటో తీయవద్దు: అభిమానికి హైదరాబాద్ ఆటగాడు క్లాసెన్ హెచ్చరిక
- ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం హైదరాబాద్ బయలుదేరిన సన్‌రైజర్స్
- "మీరు చాలా బాగా ఆడారు" అంటూ అభిమాని ప్రశంస
- ఫొటో తీయడానికి ప్రయత్నించడంతో వద్దని వార్నింగ్
ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం, సన్‌రైజర్స్ జట్టు హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ సమయంలో క్లాసెన్‌తో ఒక అభిమాని మాట్లాడుతూ, "మీరు చాలా బాగా ఆడారు" అని ప్రశంసించాడు. క్లాసెన్ స్పందిస్తూ, "థాంక్యూ వెరీమచ్ సర్" అన్నాడు.
అంతలో ఆ అభిమాని ఫొటోలు తీయడానికి ప్రయత్నించాడు. "దయచేసి ఫొటోలు, వీడియోలు తీయకండి. నేను అటు తిరిగితే నా ఫ్యామిలీ ఫొటోలు తీస్తారు. కానీ అలా చేయకండి. మీరు ఆపకపోతే బాగుండదు. మిమ్మల్ని మట్టికరిపిస్తాను" అని హెచ్చరించాడు. క్లాసెన్ హెచ్చరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కానీ ఇందులో అతని ముఖం మాత్రం కనిపించలేదు. సామాజిక మాధ్యమాల్లో క్లాసెన్‌కు మద్దతు లభించింది.