ఇరాన్ పతనం అంచున ఉంది.. వాళ్లే మాకు చెప్పారు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య
- హర్మూజ్ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ కోరిందన్న ట్రంప్
- ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని వ్యాఖ్య
- అంతర్గత విభేదాలను వారు పరిష్కరించుకోవాలని సూచన
ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తమ దేశ ప్రతినిధులతో చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
అయితే ఇరాన్ నుంచి ఎవరి ద్వారా తనకు ఈ సమాచారం అందిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అలాగే ఈ సంభాషణ నేరుగా జరిగిందా లేక మధ్యవర్తి ద్వారా తెలిసిందా? రిపబ్లికన్ ప్రభుత్వంలో ఎవరికి ఈ సమాచారం అందింది? అనే ప్రశ్నలపై కూడా వైట్ హౌస్ స్పందించలేదు.