యూట్యూబ్‌లో ‘గాయపడ్డ సింహం’ గర్జన.. 2 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్
- 'గాయపడ్డ సింహం' ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుత స్పందన
- 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళుతున్న ట్రైలర్
- ప్రధాన పాత్రల్లో తరుణ్ భాస్కర్, ఐడీ చక్రవర్తి
- పవన్ సాధినేని సమర్పణ.. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
- మే 1న థియేటర్లలో విడుదల కానున్న సినిమా
ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్‌తో పాటు జేడీ చక్రవర్తి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. పవన్ సాధినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా... కశ్యప్ శీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉమేష్ కుమార్ బన్సాల్, దివ్య విజయ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ట్రైలర్‌కు వస్తున్న స్పందన చూసి చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. యూట్యూబ్‌లో వ్యూస్ సంఖ్య పెరుగుతుండటంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.