నష్టాలు తగ్గించుకునేందుకు... తమిళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం
- ఇకపై రెమ్యునరేషన్ కాదు.. లాభనష్టాల్లో వాటా
- తమిళ చిత్ర నిర్మాతల మండలి సంచలన తీర్మానం
- మే 2న చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపు
- నటీనటుల సంఘం సహకరించకుంటే నిరవధిక సమ్మెకు హెచ్చరిక
నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ కొత్త విధానానికి నటీనటుల సంఘం (నడిగర్ సంగం) సహకరించాలని కోరారు. తమ నిర్ణయానికి మద్దతుగా మే 2న ఒకరోజు పాటు చిత్ర పరిశ్రమలో షూటింగులు, ఇతర పనులు నిలిపివేస్తూ టోకెన్ స్ట్రైక్‌కు పిలుపునిచ్చారు. నడిగర్ సంగం చర్చలకు రాకపోతే, నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోమని నిర్మాతల మండలి హెచ్చరించింది.