అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా!
- అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం
- కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్
- భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా
- 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఈషా అంబానీ, శ్లోకా మెహతా తదితరులు రిహానాకు సాదర స్వాగతం పలికారు. వారితో కలిసి రిహానా భోజనం చేస్తూ సరదాగా ముచ్చటించారు. ఈ విందు కార్యక్రమం కుటుంబసభ్యుల మధ్య అత్యంత ఆత్మీయంగా జరిగింది.
రిలయన్స్ రిటైల్ సంస్థ తన సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్ 'ఫెంటి బ్యూటీ' వేడుకల కోసం రిహానాను భారత్‌కు తీసుకువచ్చింది. ఈ బ్రాండ్ ఉత్పత్తులు భారత్‌లో ప్రత్యేకంగా 'టిరా', 'సెఫోరా' స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఈ బిజినెస్ టూర్ లో భాగంగానే ఆమె అంబానీ కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
రిహానా గతంలో అనంత్ అంబానీ ప్రీ వెడ్డిండ్ వేడుకల్లోనూ సందడి చేశారు.

