అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ నుంచి ముప్పు, అందుకే ప్రమాదకర మిషన్ చేపట్టాం: పీట్ హెగ్సెత్
- హర్మూజ్ జలసంధి వద్ద నౌకల రాకపోకలపై దిగ్బంధం కొనసాగుతుందని వెల్లడి
- జలసంధిపై నియంత్రణ మరింతకాలం పొడిగిస్తామన్న పీట్ హెగ్సెత్
- టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తుందని ఆగ్రహం
హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా నేవీ దిగ్బంధనాన్ని ఆయన ఉక్కు కవచంతో పోల్చారు. ఇది శాశ్వత నిర్బంధంగా కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని విడనాడే వరకు ఆ దేశంపై ఒత్తిడి ఉంటుందని అన్నారు. తమ అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధిని ఏ రవాణా నౌక దాటదని హెచ్చరించారు. జలసంధిలో నౌకలపై దాడులు చేస్తూ టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు.
ఇరాన్ సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని విమర్శించారు. తమ దిగ్బంధనం గల్ఫ్ దాటి విస్తరిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడేందుకు తాము ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ పరోక్ష చర్చలకు సిద్ధమైన సమయంలో హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు.