ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ
- శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న అబ్బాస్ అరాఘ్చీ
- అరాఘ్చీకి స్వాగతం పలికిన పాక్ విదేశాంగ మంత్రి
- పాకిస్థాన్ ప్రతినిధులతో ఇరాన్ సంప్రదింపులు
- అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని తెలిపిన ఇరాన్
ఈరోజు మునీర్‌తో అరాఘ్చీ బృందం భేటీ అయింది. మరోవైపు, చర్చల కోసం అమెరికా ప్రతినిధులు పాకిస్థాన్ బయలుదేరారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా సమావేశం ఉండబోదని ఇప్పటికే ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ అరాఘ్చీ పాకిస్థాన్ ప్రతినిధులతో సమావేశమై ఇరాన్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అమెరికాతో యుద్ధం ముగింపు అంశంపై పాకిస్థాన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు.