బెల్లంకొండ ఇంట పెళ్లి బాజాలు.. మెగాస్టార్‌కు పెళ్లి పత్రిక అందజేసిన సాయి శ్రీనివాస్
- త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
- అధికారికంగా మొదలైన వివాహ కార్యక్రమాలు
- తండ్రితో కలిసి చిరంజీవిని ఆహ్వానించిన శ్రీనివాస్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన ఫొటోలు
ఇవాళ సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. తమ కుటుంబ వేడుకకు తప్పకుండా హాజరు కావాలని మెగాస్టార్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చిరంజీవి కాబోయే వరుడు సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. ఈ ఆత్మీయ కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభిమానులు, నెటిజన్లు `#SreenivasaKalyanam` అనే హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త జంటకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వివాహ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బెల్లంకొండ సురేశ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారని సమాచారం.