ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
- కాల్పుల విరమణ పొడిగించడం ఇష్టంలేదన్న ట్రంప్
- ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
- విరామ సమయంలో అదనపు ఆయుధాలను సమకూర్చుకుంటామని వెల్లడి
ఇరాన్‌పై దాడులు తిరిగి ప్రారంభించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని, తాను ఆదేశిస్తే అదే జరుగుతుందని హెచ్చరించారు. తదుపరి చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణను కొనసాగిస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కాల్పుల విరమణ కొనసాగించాలనుకోవడం లేదని అన్నారు. తమకు అంత సమయం కూడా లేదని తెలిపారు. కాగా, కాల్పుల విరమణ నేడో, రేపో ముగియనుంది.