ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో!
- దేశవ్యాప్తంగా 600కు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమైనట్లు ప్రకటన
- ఆసుపత్రులపై దాడి యుద్ధ నేరమంటున్న ఇరాన్.. ఖండించిన అమెరికా
- ఆసుపత్రుల నుంచి ఇరాన్ సైనిక కార్యకలాపాలు జరుపుతోందని అగ్రరాజ్యం ఆరోపణ
ధ్వంసమైన ఆసుపత్రి భవనం, శిథిలమైన వార్డులు, నాశనమైన వైద్య పరికరాల దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రపంచానికి విడుదల చేసింది. ఈ చర్యల వల్ల దేశంలో తీవ్రమైన మానవతా సంక్షోభం తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం పేరుతో సామాన్యులకు వైద్యం అందించే ఆసుపత్రులపై దాడులు చేయడం స్పష్టమైన యుద్ధ నేరమని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.