షూటింగ్‌కు గ్యాప్... కిచెన్‌లో గరిటె తిప్పిన శ్రుతి హాసన్!
- వంటగదిలో గరిటె తిప్పిన నటి శ్రుతి హాసన్
- ఇంట్లోనే అంబూర్ బిర్యానీ, కథిరికాయ్ కర్రీ తయారీ
- తన వంటకం ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న సలార్ బ్యూటీ
- ప్రస్తుతం సలార్ 2 సినిమాతో బిజీగా ఉన్న శ్రుతి
ఈ వంటకాల ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న శ్రుతి.. "ఇంట్లో చేసిన అంబూర్ బిర్యానీ, కథిరికాయ్ కర్రీ... నాలోని కుక్ మళ్లీ వచ్చేసింది" అని క్యాప్షన్ జోడించారు. శ్రుతి ఇలా వంటకాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత మార్చిలో కూడా షూటింగ్ నుంచి విరామం దొరకడంతో ఓ సరికొత్త స్నాక్ రెసిపీని ప్రయత్నించారు. వెనిలా గ్రీక్ యోగర్ట్‌లో ఖర్జూరాలు, కొద్దిగా ఉప్పు, ఆలివ్ ఆయిల్ వేసి తయారు చేసిన ఆ స్నాక్ వీడియోను పంచుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే, శ్రుతి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం'లో హీరోయిన్గా కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్' గత ఏడాది విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండో భాగాన్ని కూడా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది.