స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!
- పెళ్లి వార్తలకు బలం చేకూర్చిన ఫ్యామిలీ మీటింగ్!
- త్వరలోనే పెళ్లి బాజాలు మోగవచ్చని అంచనా
- అధికారికంగా స్పందించని మహిళా క్రికెటర్
ఇందుకు తగ్గట్లే సోషల్ మీడియాలో వారు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అయితే, తాజాగా ఇరు కుటుంబాలు కలిసిపోయాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, ఇరు కుటుంబాలు కలిసిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రైవేట్ వేడుకలో స్మృతి, పలాశ్ కుటుంబ సభ్యులు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది. దీంతో వీరి పెళ్లి ముహూర్తాలపైనే చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంది.