పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో!
- పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో
- సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత
- ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కేంద్రానికి వచ్చే ఓటర్లకు ‘నీల’ రోబో చేతులు జోడించి నమస్కరిస్తోంది. ‘ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అంటూ సందేశం ఇస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. ఈ అనూహ్య పరిణామానికి ఓటర్లు, ముఖ్యంగా యువత ఆశ్చర్యపోయారు. చాలామంది ‘నీల’ రోబోతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, ఓటర్లలో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేసింది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.