రాజకీయాలు వేరు, కుటుంబం వేరు.. భర్త నామినేషన్ వేస్తుంటే హాజరైన కుష్బూ
- మధురై సెంట్రల్ నుంచి పోటీకి సిద్ధమైన నటుడు సుందర్ సి
- భర్త నామినేషన్‌కు హాజరైన బీజేపీ నాయకురాలు కుష్బూ
- పుదియ నీతి కట్చి పార్టీ తరఫున రెండాకుల గుర్తుపై పోటీ
- డీఎంకే అభ్యర్థి పళనివేల్ త్యాగరాజన్‌తో ప్రధాన పోటీ
సుందర్ సి పుదియ నీతి కట్చి పార్టీ తరఫున బరిలో దిగుతున్నారు. పొత్తులో భాగంగా అన్నాడీఎంకేకు చెందిన 'రెండాకుల' గుర్తుపై ఆయన పోటీ చేయనున్నారు. సుందర్ సి నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నేత ఏ.సి. షణ్ముగంతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మధురై సెంట్రల్ స్థానంలో ఈసారి గట్టి పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే, బలమైన నేత పళనివేల్ త్యాగరాజన్ బరిలో ఉన్నారు. వీరితో పాటు టీవీకే నుంచి వీఎంఎస్ ముస్తఫా, ఎన్టీకే నుంచి కే. అబ్దుల్ హకీమ్ కూడా పోటీ పడుతుండటంతో ఇక్కడ చతుర్ముఖ పోరు జరగనుంది. సుందర్ సి రాకతో ఈ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 6తో ముగియనుంది.